

జనం న్యూస్ 19జనవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
ఆసిఫాబాద్ :ఏజెన్సీ ప్రాంతములో చలి తీవ్రతనుబట్టి ప్రజలకు అనేక ఇబ్బందులు ఉండడమును చూసి చలించిన నేషనల్ నింబుల్స్ హ్యుమన్ రైట్స్ తెలంగాణ సెక్రటరీ కంటె ఏలియా తల్లి దండ్రులైనా ఎంకవ్వ రాజయ్య జ్ఞాపకార్ధం ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద లైన అనాధలను చలిలో చూసి వారిమీద జాలి,కరుణ,దయతో ఆయనే స్వయంగా బట్టల షాపుకు వెళ్లి విలువైన స్వేట్టర్స్ కొని తెచ్చి ప్రేమ తో నిరుపేదలైన ఆనాధలైన అనిల్, సీత, గంగామణి, మేరీలకు పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్బంగా కంటె ఏలియా మాట్లాడుచునా తల్లీ దండ్రుల జ్ఞాపకార్ధం ప్రతి ఏడాది అనాధలకు ఎల్లప్పుడూ ఏదోవిదంగా వారి ఇబ్బందుల్లో ఆదుకోవడమే నా జీవితంలో ఒక భాగం అని ఇదే నిజమైన భక్తి ఆనందం అని అన్నారు. ఇప్పటికి అనాధలను చదివించుటలో సహాయ సహకారంలు అందిస్తూ ముందుకు సాగుచున్నానని వారు గుర్తు చేసారు. భవిష్యత్తు లో మారుమూల గ్రామం దత్తత తీసుకొని అక్కడఒక పాఠశాల, నిర్మించాలని ఆశ కలిగిన్నానని తెలిపారు. ఈ కార్యక్రమం లో నాయకులు ట్రూ ఫ్రెండ్స్ బాప్టిస్ట్ చర్చ్ జైనూర్ సహోదరి సహోదరులు పాల్గొన్నారు.