

జనం న్యూస్ మే 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని సూర్య నాయక్ తండా నుండి కొప్పుల గ్రామ వరకు బీటీ నిర్మాణం అసంపూర్తిగా నిలిచి పోయింది రోడ్డు నిర్మాణం విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు కంకర పోసి వదిలి వేసిన రోడ్డు పై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంటనే రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు చెప్పిన ఎలాంటి స్పందన లేదు రెండేళ్ల క్రితం సూర్య నాయక్ తండా నుండి కొప్పుల గ్రామానికి నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 262 50 లక్షల రూపాయలు మంజూరు చేసింది రెండు సంవత్సరాల క్రితం రోడ్డు పనులు ప్రారంభించి కంకర పోశారు కాగా మంజూరైన నిధులకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలో నే వదిలేశారు చాల కాలంగా ఒక్క గ్రామ నుండి మరొక్క గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు….