

జనం న్యూస్ మే 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం జోరుగా కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోత, ఎండతీవ్రత, వేడితో బాధపడిన నగర వాసులకు ఉపశమనం లభించింది. ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్ లలో వాతావ రణం ఒక్కసారిగా చల్లబడి జోరువాన కురిసింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్ లింగంపల్లి, రామ్‌నగర్, విద్యానగర్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, నాగారం ప్రాంతాల్లో వరు ణుడు విలయ తాండవం చేశాడు. సాయంత్రం వేళ ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో భాగ్యనగర వాసులు ఉపిరి పీల్చుకున్నారు. సాయంత్రం వేళ వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు ఈదురు గాలులు, వర్షంలో చిక్కుకున్నారు.వడగళ్ల వాన : ఈసీఐఎల్ పరిధిలో ఈదురుగాలులతో పాటు రాళ్ల వర్షం కురిసింది. కాప్రా పరిధిలోని పలు కాలనీల్లో ఈదురుగాలులకు కరెంట్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈదురుగాలులతో విద్యా నగర్, అడిక్మెట్, గాంధీనగర్, బోలక్పూర్, కవాడీగూడా ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం మొదలైంది. తెలంగాణలో నూ పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా గత రెండు రోజులుగా రాష్ట్రం లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాలు, ఈదురుగాలులతో చాలాచోట్ల మామిడి కాయలు రాలి చాలా నష్టం వాటిల్లుతోంది. అటు కల్లాల్లోని ధాన్యం తడిచి నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.