Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 05 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనదారులపై పెండింగులో ఉన్న ఈ- చలానాలను చెల్లించే విధంగా పోలీసు
అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మే 4న ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ పోలీసు స్టేషను పరిధిలో వాహన తనిఖీలు చేపట్టి, ఆయా వాహనాలపై పెండింగులో ఉన్న ఈ-చలానాలను వాహనదారులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి, వాహన తనిఖీల్లో వాహనాల
రికార్డులను పరిశీలించి, ఆయా వాహనాలపై ఏమైనా పెండింగు ఈ-చలానాలు ఉన్నవి, లేనిది చెక్ చేయాలన్నారు. ఆయా వాహనాలపై ఏమైనా ఈ చలానాలు పెండింగులో ఉన్నట్లయితే, వాటిని వాహనదారులు చెల్లించేంత వరకు ఆయా వాహనాలను సీజ్ చేయాలన్నారు. ఎం.వి.నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఈ-చలానాలను విధిస్తున్నప్పటికీ వాహనదారులు వాటిని చెల్లించుటలో నిర్లక్ష్యం వహించడం వలన ఆయా వాహనాలపై ఈ-చలానాలు పెండింగులో ఉండిపోతున్నాయన్నారు. కావున, పోలీసు అధికారులు ఈ తరహా వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగు ఈ-చలానాలను వాహనదారులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగులోఉన్న ఈ-చలానాలను
చెల్లించేంత వరకు వాహనాలను కూడా సీజ్ చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. వాహన తనిఖీలు చేపట్టే సమయాల్లో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. అదే విధంగా ఎం.వి.నిబంధనలను ఉల్లంఘించినా వారిపై ఈ చలానాలను క్రొత్తగా విధించాలని, పెండింగులో ఉన్నచలానాలను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.