

జనం న్యూస్ 20 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : గూగుల్ సెర్చ్ చేస్తున్నవారినే టార్గెట్‌గా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని విజయనగరం SP వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఎక్కువ మంది తమకు అవసరమైన వాటిని గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వెతుకుతున్నారని ఆయన అన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసి సెర్చ్ చేసే సమయంలో ఆ సైట్ ముందు వరుసలో వచ్చేలా చేసి డబ్బులు దోచుకుంటున్నారని, పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు.