Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

విధి నిర్వహణలో నిజాయితీగా రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు అదే విధంగా డ్రగ్స్ రహిత మండలంగా ఉండటం కోసం యువత చెడు మార్గాలు పట్టకుండా వారికి సూచనలు సలహాలు ఇస్తూ యువతను మేల్కొల్పే విధంగా పనిచేస్తున్న మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ నీ మర్యాదపూర్వకంగా కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి శాలువా కప్పి పూలమాల తో సన్మానించినారు. రాజకీయాలకు అతీతంగా చట్టప్రకారం విధులు నిర్వహించాలని ఎస్సై నీ కలిసిన వారు సూచనలు చేసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్, పాస్టర్ ఇస్మాయిల్,మంద ఏసుపాదం,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.