

జనం న్యూస్ జనవరి 20, : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో 149 లక్షల ఎకరాలకు రైతు భరోసా వస్తుందని, పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో మూడు హామీలను ప్రభుత్వము ఈ నెల 26 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో 5. 90 లక్షల ఎకరాలు సాగుకు అనువైన భూములు ఉన్నాయని, ప్రతి రైతుకు 26వ తేదీ నుంచి రైతులు ఖాతాలలో ఎకరాకు 6,వేల చొప్పున జమ చేస్తామన్నారు. రైతు భరోసా తో పాటు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు మంజూరు రేషన్ కార్డులు జారీ ఈ నెలలో ప్రారంభమవుతుందని, ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పరుశురామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ రెడ్డి,సురేందర్,శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.