

జనం న్యూస్,మే06, జూలూరుపాడు:మండల
కేంద్రంలో వెంగన్నపాలెం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి వైరా నియోజకవర్గ శాసనసభ్యులు రాందాస్ నాయక్ శంకుస్థాపన చేశారు జూలూరుపాడు మండల ప్రజలు బస్టాండ్, మరుగుదొడ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఈ విషయమై ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు నిరసనలు దీక్షలు చేపట్టారు. గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాములు నాయక్, బషల్టర్ నిర్మిస్తామని అభయమిచ్చినా ఫలితం దక్కలేదు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ప్రజలు ఇబ్బందులను చూసి గ్రామపంచాయతీ కార్యాలయం తో పాటు బస్సు షెల్టర్ మరుగుదొడ్లను నిర్మించాలని అధికారులకు ఆదేశించడంతో, ప్రజలు చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వాతి బిందు, ఎండిఓ కరుణాకర్ రెడ్డి, ఎంపీ ఓ తులసిరామ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మాజీ ఎంపిటిసి మధు, జూలూరుపాడు మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్, అధికారులు కార్యకర్తలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.