

జనం న్యూస్ మే 6 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ )
బిసి మరియు ఈడబ్ల్యూఎస్ మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ముమ్మిడివరం మండలం అన్నం పల్లి గ్రామంలో స్థానిక శాసనసభ్యులు దాట్లసుబ్బరాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 90 రోజుల శిక్షణకు ఈ కేంద్రం యందు నమోదు చేసుకొని 70 రోజుల పూర్తి అటెండెన్స్ కలిగి ఉంటారో వారికి కుట్టుమిషన్ ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గాడిలoక గ్రామం లో 1.కోటి 10 లక్షలు రూపాయి లతో సీసీ రోడ్ డ్రైన్ ప్రారంభోత్సవం చేయడం నగర పంచాయితీ పరిది లో అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మధుర్ తో బుచ్చిబాబు పాల్గొని దొమ్మటి వారి పాలెం లో సీసీ రోడ్ శంకుస్థాపన, టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర సీసీ రోడ్ శంకుస్థాపన, కొండలమ్మ చింత-బాలయోగి రోడ్ 1.68 కోట్ల రూపాయి లతో ప్రారంభోత్సవం ఎంపీడీఓ ఆఫీస్ లో కుట్టుమిషన్స్ శిక్షణ సెంటర్ ప్రారంభోత్సవం, సోమిదేవరపాలెం లో కమ్యూనిటీ బిల్డింగ్ ఓపెనింగ్ చేయటం జరిగిందిఈ కార్యక్రమం ద్వారా మహిళలు స్వయం ఉపాధి సాధించుటకు మరియు వారి అభివృద్ధికి ఎంతో దాదాపు చేస్తుందని ఈ అవకాశాన్ని మండలంలో ఉన్నటువంటి ఈ డబ్ల్యూఎస్ మరియు బీసీ మహిళలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. నియోజకవర్గం పరిధిలో సుమారు 10 కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలోచెల్లి వివేకానంద,గుత్తుల సాయి, గోలకోటి దొరబాబు, తాడి నరసింహారావు, అర్ధాని శ్రీనివాసరావు, దొమ్మటి రమణకుమార్, దాట్ల పృథ్వి, కాకర్లపూడి రాజేష్, సాగిరాజు సూరిబాబు రాజు,ఎంపీపీ కొలా గంగా భవాని, నగర కమిషనర్ పి .రవివర్మ, గుద్దటి జమ్మి, గొల్లపల్లి ధర్మారావు, చిక్కాల అంజిబాబు, గొల్లపల్లి గోపి, గోదాసి పుండ్రిష్, కర్ర దుర్గాప్రసాద్ , శ్రీధర్ ,దూడల స్వామినాయుడు,సరిపెల్ల శ్రీనివాసరాజు,యాళ్ల ఉదయ్, సరిపెల్ల శ్రీనివాసరాజు,నడింపల్లి శ్రీనివాసరాజు, ములపర్తీ బాలకృష్ణ,కడలి నాగు ,కట్టా సత్తిబాబు,ఆడబాల సతీష్ ,మాదాల బుజ్జి,పిల్లి నాగరాజు,బొంతూ శ్రీరాములు, దంగేటి శ్రీనివాస్ ,నడింపల్లి శ్రీనివాస రాజు, కాశి లాజర్ ,కె.వి.ఆర్, ఎస్.మ్ ఏస్ ప్రసాద్,చింతపల్లి రాజు , కొరసాల శివ, మెండి కమల,వాసం శెట్టి అమ్మాజి,బొక్క రుక్మిణి, కుడిపూడి మల్లేశ్వరి,ప్రసన్న,చింతలపూడి కొండబాబు,బొక్కా కృష్ణ, దొమ్మేటి దుర్గారావు, బురుగు కళ్యాణ్ , కుంచె శ్రీను,కూటమినేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
