

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 07 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
నిందితులపై వివిధ పోలీసు స్టేషన్లులో నమోదవుతున్న కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారు కావాలంటే దర్యాప్తు అధికారులు నేర స్ధలంనుండి శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలను సేకరించడం, వాటిని పరీక్షల కొరకు ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపడం చాలా క్రియాశీలకమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మే 6న అన్నారు. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో జిల్లాలో పని చేస్తున్న దర్యాప్తు అధికారులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని మిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిధిగా హాజరై, శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదవుతున్న క్రిమినల్ కేసుల్లో నిందితులు శిక్షింపబడాలంటే నేర స్థలం నుండి ఆధారాలు సేకరించడం, వాటిని సక్రమ పద్ధతిలో లేబిలింగు చేయడం, న్యాయ స్థానంలో నిరూపించడం క్రియాశీలకమన్నారు. నేర స్థలం నుండి ఆధారాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించడం, వాటిని ప్యాకింగు చేయడం, పరీక్షల కొరకు సకాలంలో ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపడం చాలా ముఖ్యమైన వ్యవహారమన్నారు. రాష్ట్ర డీజీపీ శ్రీ హరీశ్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారి ఆదేశాలతో మే 6న జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని
ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించామన్నారు. ఈ వర్కుషాపులో ఫోరెన్సిక్ నిపుణులు తెలియజేసిన మెళుకువలను కేసుల దర్యాప్తులో వినియోగించి, న్యాయ స్థానాల్లో నిందితులు శిక్షింపబడే విధంగా కేసులను దర్యాప్తు చేయాలని శిక్షణకు హాజరైన పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. నేర స్థలం నుండి ఆధారాలను సేకరించడంలో ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక పద్ధతులను అవలంభించాలన్నారు. నేరానికి పాల్పడిన ప్రతీ నిందితుడు శిక్షింపబడితేనే నేరాలు తగ్గుముఖం పడతాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.నేర స్థలం నుండి ఆధారాలను సేకరించడం, వాటిని ప్యాకింగు చేయడం, సిరాలజీ, ఫోరెన్సిక్ ఫిజిక్స్, డి.ఎన్.ఎ.,టాక్సికాలజీ, రసాయన, నార్కోటిక్, సైబరు, ఆడియో, వీడియో పరీక్షలకు పంపడంలో మెళుకువలను ఫోరెన్సిక్ నిపుణులుదర్యాప్తు అధికారులకు వివరించారు. నేర స్థలం నుండి రక్త నమూనాలను, సెమన్, వెంట్రుకలు, ఉమ్ము, పాదముద్రలు,వేలిముద్రలు సేకరించడం, మత్తు పదార్థాలు, మానవ అవయవాలు, విష పదార్థాలు, సైబరు నేరాలకు సంబంధించినకేసుల్లో ఆడియోలు, వీడియోలను, మెమరీ కార్డులు, హార్డ్ డిస్క్ లను భద్రపర్చి, ఫోరెన్సిక్ ల్యాబ్లలకు వండడంలోతీసుకోవాల్సిన జాగ్రత్తలను, శిక్షణ కార్యక్రమంలో దర్యాప్తు అధికారులకు ఫోరెన్సిక్ నిపుణులు వివరించారు. అదే విధంగా ఫోరెన్సిక్ పరీక్షల్లో నేరం నిరూపించేందుకు అవసరమైన స్పష్టమైన ప్రశ్నలతో లెటర్ ఆఫ్ అడ్వయిజ్ ప్రిపేర్ చేసి పంపాలని ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు అధికారులకు సూచించారు. అనంతరం, వర్కు షాపులో పాల్గొన్న ఫోరెన్సిక్ నిపుణులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహూకరించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, ఎస్.రాఘవులు, మంగళగిరి,విశాఖపట్నం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు వి.ప్రియాంక, ఎం.సుమాలిక, ప్రశాంతి, పలువురు సిఐలు, ఎస్ఐలు,ఏఎస్ఐ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.