Listen to this article

ఉగ్రవాదులపై విజయవంతంగా దాడులు నిర్వహించి వారికి సరైన బుద్ధి చెప్పడం అభినందనీయం

భారతీయులందరూ గర్వించాల్సిన సమయం..

ఉగ్రవాదం సమూలంగా నిర్మూలింపబడాలి

మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్ / రామిరెడ్డి,

మే 07 (జనం న్యూస్):

ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం హర్షణీయమని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. పహల్గాంలో అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై విజయవంతంగా దాడులు నిర్వహించి వారికి సరైన బుద్ధి చెప్పడం అభినందనీయమన్నారు. భారతీయుడిగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గర్వించాల్సిన సమయమిదన్నారు. ఏ సంస్థ అయినా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి అమాయకుల జోలికి వస్తే ఇదేరకంగా బుద్ధి చెప్పాలన్నారు. భారతీయుడిగా ఎటువంటి సహకారాన్ని అందించేందుకు ప్రతి పౌరుడూ సిద్ధంగా ఉండాలన్నారు. దేశం కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి, మన సైన్యానికి అన్ని రకాలుగా తోడుగా,అండగా నిలుద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులపై మన దేశ సైనికులు తీసుకుంటున్న చర్యలను ఆయన మరోమారు అభినందించారు. భవిష్యత్ లో భారత దేశం ప్రపంచంలోనే ఈ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని నాగార్జున రెడ్డి ఆకాంక్షించారు.