

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : రాష్ట్రమంతట అధికారికంగా నిర్వహించాలి.ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు.చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి మహర్షి,కనక దాసు, వడ్డే ఓబన్న జయంతిలను అధికారికంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2025 ఫిబ్రవరి 15 తేదీన సంత్ సేవలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా సెలవు దినంగా ప్రకటించాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు సోమవారం పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో నాయకులు మాట్లాడుతూ సుగాలి ప్రజల అత్యంత ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి సెలవు దినంగా ప్రకటించాలనికోరారు. సుగాలి ప్రజల జీవన అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడని, వైద్యం లేని రోజుల్లో నాటు వైద్యం ద్వారా సుగాలి ప్రజలను రక్షించిన ఘనత సేవాలాల్ దని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్,కౌన్సిలర్ వి.కోటా నాయక్, నాయకులు యం.వెంకటేష్ నాయక్,కె.వాగ్యా నాయక్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.