Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

వి సికె పార్టీ చిలకలూరిపేట ఇన్చార్జి వంజా జాన్ ముత్తయ్య

పట్టణంలోని కొన్ని వారాలుగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న విషయం పట్టణ ప్రజలకు తెలుసు, ఈ నేపథ్యంలో కొన్ని కాలనీలకు కూడా నీటి సరఫరా సక్రమంగా అందనటువంటి విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు, వాటిపైన పలు రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు కూడా స్పందించారు,స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి దానిపైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అధికారులతో రివ్యూ చేశారు, నీటి ఎద్దడి లేకుండా చూడమని కూడా వారు కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో పలు మత సంస్థలకు నీళ్లు అందివ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు, దానిని ముందే గమనించి మున్సిపల్ అధికారులు ఆ మత సంస్థలకు నీటి సౌకర్యాన్ని వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా అధిగమించాలని ఎందుకు తెలియజేయలేదు అని వీసీకే పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి వంజా ముత్తయ్య మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు, సడన్గా నీటి సరఫరా ఆపితే ప్రజలు ఇబ్బంది పడతారు కదా అని అన్నారు, అది అధికారుల తప్పిదం అవుతుంది అన్నారు, అలాంటి పొరపాట్లు జరగకుండా ముందు ముందు చూసుకోవాలని అధికారులను కోరారు, ఉద్దేశపూర్వకంగా కొన్ని మత సంస్థలకు నీళ్లు ఆపితే సహించేది లేదన్నారు, అటువంటిదేమీ లేకుండా చూడాలన్నారు,వేలల్లో భక్తులను పోగేసేటటువంటి మత సంస్థలు కూడా వారికి అవసరమయ్యే సౌకర్యాలు ఏర్పాటు చేసుకొనే విషయాన్ని మర్చిపోకూడదు అన్నారు, వాటర్ సౌకర్యం కోసం ఆర్వో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసుకునే అవకాశం సంస్థలు పరిశీలించాలన్నారు,ఆ మత సంస్థ వద్దకు వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు మార్గమధ్యంలో అనుకోని సంఘటనలు జరిగితే వారికి ఇన్సూరెన్స్ సౌకర్యాలు, సంస్థలో పనిచేసే వాలంటీర్లకు భీమా సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత సంస్థల పై ఉందన్నారు, అలాంటి బాధ్యతలు మర్చిపోకూడదన్నారు, గతంలో మరియు కరోనాకాలంలో కూడా ఏఎంజీ , రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, వైయాసిస్ సంస్థ, ఆరా సంస్థ తదితర సంస్థలు వారి సొంత నిధులతో పట్టణ పుర ప్రజలకు మరియు నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేశారని వారు తెలిపారు, వారిని ఆదర్శంగా తీసుకొని ఏ మత సంస్థలు అయినా కానీ, మీ సంస్థలకు అండదండలుగా ఉంటున్న పేద ప్రజలకు, ప్రాంత ప్రజలకు కుల మతాలతో సంబంధం లేకుండా కొంత సామాజిక సేవ కూడా చేయవలసిన బాధ్యత మీపై ఉందన్న విషయం మరువకూడదన్నారు..