

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం అందజేసిన గొండ్వానా సంక్షేమ పరిషత్…
మే 7 జనంన్యూస్ వెంకటాపురం మండలం ప్రతినిధి
వెంకటాపురం మండల కేంద్రంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన రెవిన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి కలిసి గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ.ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు,ఆదిమ జాతి తెగలు వెనుక బడి ఉన్నారని, మా చట్టాలు జీవోలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే మాకు ప్రత్యేకంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే మా జీవన విధానానికి లా ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో ఫిర్యాదు చేసినప్పటికీ ధర్నాలు రాస్తారో చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ఆదివాసులపై నిరంకుశ విధానాన్ని చూపుతుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తర్వాత భద్రాచలంకి కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేసి ఆదివాసి జీవన విధానానికి తోడ్పడేలా చూడాలని కోరడం జరిగింది. ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి కణితి వెంకటకృష్ణ,వెంకటాపురం మండల నాయకులు పర్శిక అనిల్,పూనెం అర్జున్, బాబురావు ఈ కార్యక్రమంలో ఉన్నారు.