

భారత్ బలగాలను చూసి దేశం గర్విస్తుందన్న
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
జనం న్యూస్, మే 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
పాకిస్తాన్ లో భారత సైన్యం ప్రదర్శించిన ఆపరేషన్ సింధూర్ భారతీయుడిగా నేను గర్వపడుతున్నానని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉగ్రవాదం మరియు ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచానికి హానికరమే అన్నారు. భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో అందరు బాగా స్వాములు కావాలాన్నారు.