

అద్భుత చిత్రం అని భక్తుల అభినందనలు
జనం న్యూస్, మే 8 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జి ములుగు విజయ్ కుమార్)
కన్యకా పరమేశ్వరి జయంతి సందర్బంగా పసుపు బియ్యాన్ని ఉపయోగించి భారీ కన్యకా పరమేశ్వరి చిత్రాన్ని చిత్రించి తన భక్తిని చాటుకున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ఈ సందర్బంగా మాట్లాడుతూ భగవంతుణ్ణి సేవించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయన్నారు. నాలో ఉన్న కళకు పదునుపెట్టి ఎన్నో భవంతుని ప్రతిరూపాలు చిత్రించానన్నారు. కన్యాకాపరమేశ్వరి జీవిత చరిత్రను అందరు తెలుసుకోవాలన్నారు. వైష్యుల కుల దైవం. కన్యకా పరమేశ్వరి అన్నారు.