

జనం న్యూస్,మే07,అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం
అచ్యుతాపురం ఎస్టిబిఎల్ వద్ద ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నియోజవర్గంలో ఉన్న అన్ని శాఖల అధికారులుతో పీ4 సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందిని గుర్తించి పేదరికాన్ని దూరం చేయడమే లక్ష్యమని తెలిపారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన పీ 4 సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులు,సిబ్బందిని ఆదేశించారు.
