

జనం న్యూస్ మే 07(నడిగూడెం)
నడిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా గుగులోత్ హరిసింగ్ నడిగూడెం ఎంపీడీవో గా మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నేరేడుచర్ల ఎంపిఒగా పనిచేస్తూ నడిగూడెం ఎంపీడీవో గా బదిలీపై వచ్చారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో హరిసింగ్ ను ఎంపీవో విజయకుమారి, సూపరిండెంట్ ఇమామ్,కార్యాలయం సిబ్బంది అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.