Listen to this article

జనం న్యూస్// 20 //జనవరి // జమ్మికుంట // కుమార్ యాదవ్..జమ్మికుంట మండలంలోని కోరపెల్లి గ్రామానికి చెందిన ( వెంకటేశ్వర్ల పల్లి ) బోయిని సమ్మయ్య మాజీ సర్పంచ్ పై, కొందరు వ్యక్తులు, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసత్యపు ఆరోపణలతో, సదరు జమ్మికుంట ఎమ్మార్వో కి నాపై తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తులపై, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎమ్మార్వో కి ఫిర్యాదు చేయడం జరిగింది, అన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య మాట్లాడుతూ.. వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, 18/1/2025 రోజున నాపై ఎమ్మార్వో ఆఫీస్ లో, తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. భూముల విషయంలో ఎలాంటి తగాదాలు వారికి నాకు లేవు అని తెలిపారు. కేవలం రాజకీయం మరియు వ్యక్తిగతంగా గిట్టని కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కాగా నాపై తప్పుడు ఆరోపణలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నాకు న్యాయం చేయాలని, జమ్మికుంట మండల తాసిల్దార్, కి మరియు, జిల్లా కలెక్టర్ కి, అలాగే రెవెన్యూ డివిజన్ అధికారికి, ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు.