Listen to this article

జనం న్యూస్ మే 7 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)


శక్తి స్వరూపిణి కాట్రేనికోన గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు సందర్భంగా వార్షికంగా పలువురు భక్తులు ఇంట అమ్మవారికి వడికట్లు మరియు పాన్పు కార్యక్రమాలు నిర్వహించిరి.
అమ్మవారి తీర్థ మహోత్సవం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అంగరంగ వైభవంగా జరిగినది.
ఈ సందర్భంగా అమ్మవారి అత్తింటివారు మంత్రి ప్రగడ శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి వడికట్టు మరియు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా అమ్మవారి పుట్టింటివారు మంగళంపల్లి వెంకటేశ్వర్లు వారు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
అదేవిధంగా ఆణి విళ్ళ కృష్ణమూర్తి వారు ఇంటిదగ్గర మరియు ఆకొండి శ్రీరామచంద్రమూర్తి వారు ఇంటిదగ్గర
అదేవిధంగా ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి భారతి దంపతులచే వారింటి వద్ద అమ్మవారికి పాన్పు వేసి వివిధ రకాల పళ్ళు వివిధ రకాల స్వీట్స్ మరియు అమ్మవారికి చలివిడి వడపప్పు పానకాలు పసుపు కుంకమలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు.ఆసాది మందపల్లిమహేష్ మరియు వారి కుమారులు ప్రతి ఇంట అమ్మవారి దండకం చదివి పవళింపు పాటలుపాడి ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సాయిబాబా మరియు రామకృష్ణ పరమహంస, , చెరుకు మురళి అండ్ సన్స్, చెరుకు వెంకన్న బాబు, ఎల్లమెల్లి వారి కుటుంబ సభ్యులు, కాజా గంగా ప్రసాద్, వట్టూరు దుర్గా మహేష్, చెరుకు రాంబాబు , గ్రంధి సురేష్, తదితరులు పాల్గొని అమ్మవారి ఆలయం వద్ద వచ్చిన భక్తులందరికీ పులిహార ప్రసాదము మరియు గోధుమ నూక ప్రసాదం రస్నా శీతల పానీయాలు అందజేసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అదేవిధంగా ప్రతిరోజు చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా అమ్మవారి తీర్థ మహోత్సవం రోజున రాష్ట్ర బిజెపి జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ కూడా పాల్గొని వచ్చిన దాహార్తులకు మజ్జిగనివ్వడం జరిగినది.
ప్రతి సంవత్సరం అమ్మవారి ఆలయం వద్ద పలు సేవా కార్యక్రమాలు వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతో, గ్రామస్తులు, జాతర చేయించే భక్త బృందాలు, వర్తక సంఘం వారు వారందరికీ ఆలయం తరఫున ప్రత్యేక ధన్యవాదములు ఆలయచైర్మన్ సాయిబాబా తెలియ చేశారు.అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారికి కూడా ఆలయం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.