

జనం న్యూస్, మే07,
అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా మునగపాక మండలం యాదగిరిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయం ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా 8వ తేదీ గురువారం ఉదయం 9 గంటల 44 నిమిషాల నుండి భజనలు,కోలాటాలు, తోడపెద్దు సేవగరడీ,తప్పెడు గుళ్ళు, భారీ ముందుగుండు సామాగ్రితో అత్యంత వైభవంగా జరుగునని అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందని,భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ వారు కోరారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఎంపీ సీఎం రమేష్ ఏపీ ఆర్డీసీ చైర్మన్ నాగేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు, మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ హాజరవుతారని శ్రీ మరిడి మహాలక్ష్మి ఆలయ అభివృద్ధి కమిటీ వారు తెలిపారు.