

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
దేశమాత రుణం తీర్చుకోవడం కోసం ప్రాణాలర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కోట్లాదిమంది భారతీయుల గుండె గొంతుకను జనగణమన ద్వారా ఒక్కటి చేసిన విశ్వకవి రవీంద్రుడని రైజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చుక్కా విన్సెంట్ పాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాటూరి కోటేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకుడు విన్సెంట్ పాల్ మాట్లాడుతూ మహనీయులను జ్ఞాపకం చేసుకోవడం వారి చరిత్రలను ఆధారంగా చేసుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ మాట్లాడుతూ కన్నతల్లి 9 మాసాలు మోస్తే 99 సంవత్సరాలు మోసే దేశ మాత రుణం తీర్చుకోవడం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని అన్నారు. భారతదేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆంధ్ర రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే సంస్కరణల పితామహుడుగా చరిత్ర పుటలకెక్కారని అన్నారు. భూసంస్కరణలు ప్రవేశపెట్టి భూమిలేని వ్యవసాయ కూలీలకు మిగులు భూములు పంపిణీ చేయడం ద్వారా కూలీలను రైతులుగా మార్చిన ఘనుడు దామోదరం సంజీవయ్య అని రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు సహకార శాఖ ఏర్పాటు చేసి అన్నదాతల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అన్నదాతల ఆత్మబంధువు దామోదరం సంజీవయ్య అని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య పాలకులను తరిమికొట్టేందుకు అఖండ భారత జాతి గుండె గొంతుకను ఒక్కటి చేయటం అవసరమని గుర్తించి జనగణమన గీతాన్ని రచించి భారతీయుల ప్రశంసలతో పాటు బ్రిటిష్ పాలకులతో సర్ అని పిలిపించుకున్న భరతమాత ముద్దుబిడ్డ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అని వేనోళ్ల కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన కాటూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరంజీవిగా నిలిచి ఉన్నారని అన్నారు ఈ తరం నాయకులు సంజీవయ్య ని ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నస్రుద్దీన్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్ చిలకలూరిపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కారు చోల స్వప్న కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె పోగు రాజు, దాసరి శ్యాంబాబు కుంచాల సాంబశివరావు మిరియాల వెంకటరత్నం షేక్ మహమ్మద్ రఫీ పుల్లగూర పరదేశి పుల్లగూర రవి ప్రత్తిపాటి చిన్నా తాళ్లూరి వెంకట్రావు జి అంతర్వేది వల్లపు రామకృష్ణ జి పరమేశ్వరరావు తిమ్మిశెట్టి భద్రయ్య షేక్ ఉమర్ అలీ ఎం కాలేశ్వరరావు కుంచాల ఆంజనేయులు ఎస్ గోపి ఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు