Listen to this article

జనం న్యూస్ 07 మే ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కు రిమెళ్ళ శంకర్ )

అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డి పల్లిలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి మొట్టమొదటి చైర్మన్ గా నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ మల్లెల నరసింహారావు ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. మల్లెల నరసింహారావు అశ్వరావుపేట నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి చురుకైన నాయకుడు అంతేకాదు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తను అన్ని విధాల ఆర్థిక సహాయాలు చేస్తుంటాడు ప్రతి వారి కష్టంలో నేనున్నానంటూ ధైర్యం చెబుతాడు మంచి మనసున్న వ్యక్తి ఇప్పటికే అరుదైన చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు కింది స్తాయి నుంచి అనేక ఆటుపోట్లకు గురవుతూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు భవిష్యత్తులో ఇంకా అనేక పదవులు పొందుతూ ప్రజా సేవలో నిమగ్నం అవుతాడని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు అనాదిగా దేవాలయాల్లో సేవను అందిస్తున్నారు అని పుట్టుక మొదలుకొని చావు వరకు ప్రతి ఇంటిలో ప్రతీ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణుల యొక్క సేవలను తప్పనిసరిగా అవసరం అవుతాయని పేర్కొంటూ అలాంటి ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లెల నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషించదగిన పరిణామం అని ఈ దేవాలయ అభివృద్ధికి మల్లెల నరసింహారావు దేవాలయ అభివృద్ధికి తప్పనిసరిగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను భక్తులకు దేవాలయ పరిరక్షణకు నరసింహారావు సేవలు విస్తృత పరుస్తూ, లౌకిక ప్రజాస్వామ్యానికి, అణగారిన వర్గాల అభ్యుదయానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.ఆలయ చైర్మన్ గా ఎన్నికైన మల్లెల నరసింహారావు మాట్లాడుతూ పెద్ద మనసుతో ఎమ్మెల్యే అప్పచెప్పినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ దేవాలయ అభివృద్ధి కృషి చేస్తానని పేర్కొనడం జరిగింది. వెనుకబడినటువంటి వర్గానికి చెందిన నాయి బ్రాహ్మణులకు ఒక ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కడియాల సత్యనారాయణ ,నాయి బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మం జిల్లా ఆర్టిఏ డైరెక్టర్ గజ్జల్లి వెంకన్న , కొమరవెల్లి రవీందర్, నోపా ఉపాధ్యక్షులు డాక్టర్ లింగంపల్లి దయానంద్, మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగ నాయి బ్రాహ్మణ సమస్యల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తూముల శ్రీనివాస్ మాట్లాడుతూ నరసింహారావు ఎన్నిక పట్ల హర్షిస్తూ దైవం మానుస్యరూపేనాఅన్నట్లుగా ఎమ్మెల్యే సేవలు అభినందనీయం అన్నారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి తూముల సదానందం . పరిమి రాజారావు. డాక్టర్ రాధాకృష్ణ డాక్టర్ కీర్తన, దేవరకొండ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా టౌన్ అధ్యక్షులు ఎలమందల జగదీష్.పుల్లెందుల.వెంకటేశ్వర్లు జంపాల యాకయ్య, తోటపల్లి.మాధవరావు, అరసవెల్లి వెంకట్, ఏం సంపత్. దడిగల మల్లేష్. యాసంనేనివెంకట్ , ఎస్ఎంఎస్ శేఖర్ ,పరిమి సీతారాములు , ముత్యాల,లక్ష్మణ్ ,తదితరులు పాల్గొనడం జరిగింది.