Listen to this article

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి


జనం న్యూస్. మే 7, 2025:కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రక్ట్ స్టాఫ్ఫర్.కె ఏలియా.

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులైన అభ్యర్థులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు లభించే కోరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని తెలిపారు. స్థానిక నిరుద్యోగ యువతతో మాట్లాడి వారి ఆకాంక్షలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత అందించి స్వయం ఉపాధి పొందే విధంగా ప్రోత్సహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఈ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అనంతరం మండలంలోని మంకుగూడ గ్రామ పంచాయతీలో తాగునీటి వనరులు, ఈజీఎస్ పనులను పరిశీలించి నీటి వనరుల పరిస్థితిని తెలుసుకున్నారు. జిల్లాలోని ప్రతి ఇంటికి నిరంతరాయంగా త్రాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, మిషన్ భగీరథ పథకంలో నల్ల కనెక్షన్ లేని ప్రాంతాలకు నీటి ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, గ్రామంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. నీటిని ఒడిసిపట్టేందుకు, భూగర్భ జలాలను పెంపొందించేందుకు వాటర్ రీఛార్జ్, హార్వెస్టింగ్ నిర్మాణాలను చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.