Listen to this article

జనం న్యూస్ మే 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

మునగాల మండల కేంద్రంలోని శ్రీ కాశి విశ్వేర సహిత శ్రీ గోవిందా మాంబ సమేత శ్రీ మద్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయంలో స్వస్థ శ్రీ చంద్ర మానేనా శ్రీ విశ్వ వాసు నామ వైశాఖ దశమి బుధవారం శ్రీ మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 332 వ ఆరాధన మహోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయ వ్యవస్థాపకులు ముత్యాల సత్యనారాయణ చారి మాట్లాడుతూ శ్రీ చంద్ర మానేనా శ్రీ విశ్వ వాసు నామ వైశాఖ దశమి రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధి లోకి వెళ్లిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పూజా కార్యక్రమం వైభవంగా జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షుడు ఇనుగుర్తి వీరాచారి, ముత్యాల కృష్ణ, వెంకటేశ్వర్లు, శివ, ఓంకార్, జనార్ధన్, బంగారపు శ్రీనివాస్, ముత్యాల సునీత, సంధ్య, గోవిందమ్మ, సుజాత, మంగమ్మ, దేవాలయ కమిటీ వారు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదములు అందజేశారు.