

జనం న్యూస్ 08 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరి ఆలంబిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. విజయనగరంలో సిపిఐ పార్టీ కార్యాలయం అమర్ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆపరేషన్ పేరుతో గిరిజన ప్రాంతంలో 400 మందిని చంపి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక్షస నరమేధ ఆనందం పొందుతున్నారని వెంటనే ఆపరేషన్ కగార్ ను ఆపి శాంతి చర్చలకు పిలవాలి కోరారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అంబానీ ఆదానికి, అండగా పనిచేస్తుందని, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, నిత్య అవసర వస్తువుల ధరలు ఆకాశం నిండుతున్న వాటిని తగ్గించే ప్రయత్నంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. కార్మికుల పక్షాన ఉన్నామని చెప్తే కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత గాలికి వదిలేసారని అన్నారు. సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర యువతను మోసం చేశారని అన్నారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయిన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని కోరారు విమానాశ్రయాలు , రైల్వే నూతన స్టేషను పేరుతో దేశంలో ఎక్కడా లేనంత విధంగా భూ సమీకరణ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు నిధులు లేవని చెప్పడం విడ్డారం ఉందని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చినప్పుడు గుర్తులేదా అని ప్రశ్నించారు. తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు నాలుగు దశాబ్దాలు కావస్తున్న నిర్దిష్ట ప్రణాళికతో పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విఫలం అయింది అని అన్నారు రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉన్న జంజావతి నదీ జలాల అంతర్ రాష్ట్రాల సమస్యను పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం విధానం సరికాదని వెంటనే సమస్య పరిష్కారం దిశగా చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శిలు బుగత అశోక్, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ రంగరాజు, ఎన్.నాగభూషణం, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఉల్లాకుల నీలకంటేశ్వర యాదవ్, కే బీముడు, డేగల అప్పలరాజు, పీ.అప్పారావు, పొందురు అప్పలరాజు, అప్పరుబోతు జగన్నాధం తదితరులు పాల్గొన్నారు