

జనం న్యూస్ మే 8( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) గోకవరం
ఆంజనేయస్వామి గుడి సెంటర్లో ఉన్న ప్రాచీన దేవాలయం శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుమారు వంద సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన ఆలయంలో ఆలయ అర్చకులు ఆరవెల్లి సీతారామాచార్యులు ఆధ్వర్యంలో డాక్టర్ జగన్నాధ శర్మ మరియు శ్రీను శర్మ లు స్వామివారికి తమలపాకులు సింధూరం పూజ తో పాటు స్వామివారికి అభిషేకం నిర్వహించారు. భక్తుల సహాయంతో ఆలయం అంతా పుష్పాలతో అలంకరించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు