

(జనం న్యూస్ చంటి)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు ఈ సంఘటన చేగుంట మండలంలోని కర్ణం పల్లి శివారులోని గజ్వేల్ హైవేలో బుధవారం చోటు చేసుకుంది చేగుంట.ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి. కథనం.. మేరకు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన తొడంగి లింగం (50) బైక్ పై గజ్వేల్ వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.