Listen to this article

జనం న్యూస్ మే 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని శ్రీనివాస్ నగర్ మెడికల్ సొసైటీ, వివేకానంద నగర్ కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేస్ వన్ లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు లైను కు సంబంధించి ముప్పై ఐదు లక్షలతో చేపట్టనున్న పనులకు గాను ఆల్విన్ కాలనీ ఫేస్ నల్ల పోచమ్మ గుడి దగ్గర స్థానిక శాసనసభ్యులు అరికెపూడి గాంధీ తో కలిసి శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు
కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ ఈరోజు శంకుస్థాపన చేసిన పనులను వర్షాకాలం రాకముందే వీలైనంత తొందరగా నాణ్యతతో చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి మేనేజర్లు ప్రియాంక, ఝాన్సీ, సీనియర్ నాయకులు గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, ఆల్విన్ కాలనీ ఒకటవ ఫేస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, కమల ప్రసన్న నగర్ అధ్యక్షులు చంద్రశేఖర్, మాధవరం నగర్ కాలనీ అధ్యక్షులు రమణారెడ్డి, ఆంజనేయులు, జగదీష్ గౌడ్, రాఘవులు, మోహన్ రావు, సత్యనారాయణ, విద్యాసాగర్, వెంకటేశ్వరరావు రామచందర్, శ్యామ్ రావు, బాబు, రమేష్ రావు,రాజు, సోమేశ్, సుబ్బారావు, బండప్ప, కనకయ్య, యాదయ్య, కుమార్, మాధవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.