Listen to this article

జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి


మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా
మండల కేంద్రంలోని చౌరస్తాలో ఎస్సై నర్సింలు స్టేషన్ సిబ్బందితో కలిసి మండల్ పోలీసులు ప్రజలకు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు.అనుమానితులు కాల్ చేస్తే బ్యాంక్ వివరాలు, తదితర వాటిని తెలియజేయవద్దని అన్నారు. ఫోన్ లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీయం, ఫోన్ పే, గూగుల్ పే, ఈ కేవైసీ అప్‌డేట్‌ వివరాలు అడిగితే చెప్పకూడదని సూచించారు . సైబర్ నేరాలకు గురైనపుడు 1930 టోల్ ఫ్రీ నెంబరుకు వెంటనే డయల్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించా ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ లు మిస్పోద్దిన్ రాములు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు