Listen to this article

జనం న్యూస్ మే 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో

బుధవారం రోజునా రైతు వేదిక భవనంలోజిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వారి ఆధ్వర్యంలో యువతకు గంజాయి, డ్రగ్స్ మరియు కల్తీ కల్లు పై అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా స్థానిక ఎస్సై బి. రాము, టీఎస్ ఎన్ ఏ బి జీవన్ రెడ్డి, అబ్కారి ఎస్సై మానస, మెడికల్ అధికారి రక్షిత రెడ్డి వీరు మాట్లాడుతూ గంజాయి త్రాగితే నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపించి శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతిని మరణం జరుగవచ్చని మాట్లాడారు. అదేవిదంగా కల్తీ కల్లు( అల్పాజోలం మరియు డైజాపార్మ్ కల్పింది )నాడి వ్యవస్థను బలహీనపరిచి శరీరాన్ని విచ్చిన్నం చేసి చిన్న వయసులోనే మరణం కూడ జరుగవచ్చు అని మాట్లాడారు. దీని వలన మీ కుటుంబాలు చిన్నభిన్నం అయి రోడ్డు మీద పడే అవకాశం ఉంటుందని మాట్లాడారు. డ్రగ్స్ కు సంబందించిన సమాచారం తెలిస్తే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ప్రీ నెంబర్ 1908కి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరు గోప్యంగా ఉంచుతామని వారికీ పారితోషకం ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏ వో వైష్ణవ్, ఏపీఎం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.