Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

29న నిర్వహించే శంకర కంటి ఆసుపత్రి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్తిపాటి

ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహాస్తున్న సేవాకార్యక్రమాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మే 29న స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్ లో ఏర్పాటయ్యే శంకర కంటి ఆసుపత్రి వైద్య శిబిరానికి హాజరై కంటి సంబంధిత ఉచిత వైద్యసేవలు పొందాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ నెల 29న ప్రత్తిపాటి ఫౌండేషన్ ఏర్పాటుచేయనున్న ఉచిత కంటివైద్య శిబిరం పోస్టర్ ను ప్రత్తిపాటి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… ఎన్నోఏళ్లుగా పేదల సేవలో నిమగ్నమైన ప్రత్తిపాటి ఫౌండేషన్, వారికోసం అనేక సేవా కార్యక్రమాలు అమలుచేస్తోందన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల ఆరోగ్యరక్షణకు వివిధ ఆసుపత్రులతో కలిసి ప్రతిప్తి అందించిన వైద్యసేవలు వెలకట్టలేని నివాహకులు కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరిముల్లా, జవ్వాజి మధన్ మోహన్, మద్దుమల రవి, కెళ్ళంపల్లి ఆచయ్య, నాయకులు, ఫౌండేషన్ నిర్వాహకులు తదితరులున్నారు.