Listen to this article

జనం న్యూస్ మే 8 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గౌరవ ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో గవర్నమెంట్ ప్లీడర్ గా ( ఏ.జి.పి)గా కాశి సిద్ధార్థ కుమార్ ను నియమించినారు. ముందుగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి పవన్ కళ్యాణ్ కి మాటకు ప్రాణం పోసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గౌరవ శ్రీ దాట్ల బుచ్చిబాబు కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు అదే విధముగా నాకు సహకరించిన వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని నేను ఈ బాధ్యతను నిబద్దతతో నిర్వహించగలననీ తెలియజేయడమైనది.