

జనం న్యూస్ మే 8 నడిగూడెం
దేశానికి స్వాతంత్రం తీసుకవచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత్కూరి వెంకటరెడ్డి అన్నారు.జై బాపు,జై బీమ్, జై సంవినాద్ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని చాకిరాల, శ్రీరంగాపురం, రత్నవరం,తెల్లబల్లి గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగాన్ని సమర్థిస్తూ అంబేద్కర్ ను ప్రపంచ మేధావుగా కీర్తిస్తుంటే బిజెపి మాత్రం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర పండుతుందని విమర్శించారు.భారత రాజ్యాంగంలో పొందపరచిన విధులు హక్కుల గురించి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీనివాస్, దున్నా శ్రీనివాస్, వేపూరి సుధీర్,పాతకొట్ల నాగేశ్వరరావు,నూకపంగు వెంకటేశ్వర్లు, రెడ్డిపల్లి సైదులు, మిట్ట గనుపుల మోష,నూకపంగు సతీష్, గోపాలదాసు గోవిందు,లంజపల్లి వీరబాబు,సోమగాని రవి, రామిని విజయ వర్ధన్ రెడ్డి, పసుపులేటి వినయ్ వర్ధన్ బాబు,కాంపాటి ఉపేందర్,మొలుగూరి నరసింహారావు,బడేటి నరేష్, కొల్లు వీరయ్య, నలమాద వీరబాబు,నెమ్మాది స్వామి,చేకూరి నాగరాజు,రణబోతు రామిరెడ్డి,గుజ్జా అంజి,ఈదా శ్రీనివాసరెడ్డి,నెలమర్రి శ్యామ్,మారిశేట్టి నరసింహారావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్, మండలం మైనార్టీ నాయకులు షేక్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.