Listen to this article

జనం న్యూస్ మే 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

మునగాల మండల పరిధిలోని విజయరాఘవపురం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగా లన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో వచ్చిన వడ్లు, తేమ శాతం, నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు.కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో ప్యాడీ క్లీనర్‌ ఏర్పాటు చేయాలని, ధాన్యాన్ని శుభ్రం చేసిన తర్వాత తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు, హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు.అకాల వర్షాల నేపథ్యంలో అప్రమ త్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం కురిస్తే టార్పాలిన్‌ కవర్లతో ధాన్యం తడవకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు, ఏపీఎం నగేష్, ఆర్ఐ రామారావు,ఏ ఈ ఓ భవాని,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.