

జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష సమయం 90 రోజులు గడువు ఇవ్వాలని, జిల్లాకు ఒక పేపర్ విధానం పెట్టాలని, వయోపరిమితి 47 పెంచాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం అనంతరం మానవహారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూరాష్ట్రంలో నిరుద్యోగులు పోరాటపర్తితంగా డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకోవడం జరిగిందని అలాగె రాష్ట్రంలో నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసి ఏడు సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షం వ్యక్తం చేశారు ఏడు సంవత్సరాల తర్వాత ఏలోఓడినటువంటి నోటిఫికేషన్ లో నిరుద్యోగులు సన్నద్ధం అవ్వడానికి పరీక్షకు కనీసం 90 రోజులను సమయం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అన్నారు. అలాగే వయోపరిమితి 44 సంవత్సరాల కేటాయించడంతో ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటూ వయోభారంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇది చాలా ఇబ్బంది కలిగినటువంటి విషయం అన్నారు. ఒక రాష్ట్రం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 47 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవడానికి వయోపరిమితి పెంచిందని రాష్ట్ర ప్రభుత్వం గుణ 47 సంవత్సరాలకు వరకు అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా నార్మలైజేషన్ రద్దుచేసి జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారిగున అవకాశం కల్పించాలని గ్రామీణ ప్రాంతాలలో మధ్యతరగతి ప్రజలు రెగ్యులర్ పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడే సందర్భంలో పనులు చేసుకుంటూ విద్యను సాగించకరంలో ఓపెన్ చదవడం జరిగిందని ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ లో ఓపెన్ వారికి అర్హతలు లేదా అని చెప్పడం దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాము,బాను, ఈశ్వర్ రావు, dsc అభ్యర్థులు పాల్గొన్నారు….