Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్.

జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషనులో 2022వ సంవత్సరంలో నమోదైన ప్రేమ పేరుతో వంచించి,
అత్యాచారంకు పాల్పడి, పెండ్లికి నిరాకరించిన కేసులో నిందితుడు బొబ్బిలి మండలం సీతయ్యపేట గ్రామానికి చెందిన దివనాపు అఖిల్ అంబేత్కర్ (29 సం.లు)కి విజయనగరం మహిళా కోర్టు కమ్ 5వ ఎడిజె కోర్టు జడ్జి శ్రీమతి ఎన్.పద్మావతి గారు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.15వేలు జరిమాన విధిస్తూ మే 8న తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి మండలం సీతయ్యపేట గామానికి చెందిన నిందితుడు దివనాపు అఖిల్ అంబేత్కర్ (29 సం.లు)అనే వ్యక్తి పాచిపెంట మండలానికి చెందిన ఒకామెను ప్రేమిస్తున్నానని నమ్మించి, వంచించి, శారీరకంగా అనుభవించి,
పెండ్లికి నిరాకరించినట్లుగా ఇచ్చిన ఫిర్యాదుతో బొబ్బిలి పోలీసు స్టేషనులో 2022సం||లో అప్పటి బొబ్బిలి ఇన్స్పెక్టరుఎం.నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టుచేసి రిమాండుకు తరలించి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. న్యాయస్థానంలో నిందితుడు దివనాపు అఖిల్ అంబేద్కర్ నేరంకు పాల్పడినట్లుగా సాక్ష్యాలు నిరూపితం కావడంతో విజయనగరం మహిళా కోర్టు కమ్ 5వ ఎ.డి.జె. కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ఎన్.పద్మావతి 10సం.లు కఠిన కారాగార శిక్ష మరియు రూ.15 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎన్.శకుంతల వాదనలు వినిపించగా, బొబ్బిలి ఇన్స్పెక్టరు కే.సతీష్ కుమార్ పర్యవేక్షణలో కోర్టు హెడకానిస్టేబుల్ ఎం.మన్మధరావు, సి.ఎం.ఎస్.2 కానిస్టేబుల్ సిహెచ్.సౌజన్య సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారన్నారు. కేసులో
త్వరితగతిన నిందితుడికి శిక్షపడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ అభినందించారు.