

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ , ఐపిఎస్
జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, డ్రోన్స్, బాంబ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు ముమ్మరం చేసి, ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అప్రమత్తమైనట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మే 8న తెలిపారు.
దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో ముఖ్య ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో అప్రమత్తమై, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించుటకు తనిఖీలు ముమ్మరం చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూలు, చింతపల్లి లైట్ హౌస్, తీర ప్రాంతంలోని గ్రామాల్లోను మెరైన్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి, తీరప్రాంత గ్రామస్థులను అప్రమత్తం చేసామన్నారు. అంతేకాకుండా, కోరుకొండ సైనిక్ స్కూలు, అధికార భవనాలు, చింతపల్లి లైట్ హౌస్ తోపాటు మరియు ఇతర తీరప్రాంత గ్రామాలైన తిప్పలవలస, ముక్కాం, నీలగెడ్డపేట, పాద్దూరు, చేపల కంచేరులో డ్రోన్స్, డాగ్స్, బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టామన్నారు. సముద్రంలో చేపల వేట పై నిషేదం ఉన్నందున మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని, తీర ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చే షిప్పులు, అనుమానస్పద వ్యక్తులు ఎదురుపడితే సమాచారాన్ని మెరైన్ లేదా స్థానిక పోలీసులకు అందించాలని కోరామన్నారు. యుద్ధ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై, మెరైన్ పోలీసుల సహకారంతో పటిష్టమైన భద్రత చర్యలుచేపట్టడంతోపాటు, తీరప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భోగాపురం సిఐ కే.దుర్గా ప్రసాద్, మెరైన్ సిఐ బి.వి.జె.రాజు, భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ, విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు, పలువురు ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, మెరైన్ పోలీసులు, డాగ్, బాంబ్ స్క్వాడ్స్, డ్రోన్స్ సిబ్బంది పాల్గొన్నారు.