

జనం న్యూస్ 09 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు గురువారం నిర్వహించిన తనిఖీల్లో రూ. 10,000 విలువచేసే రెండు కేజీల గంజాయి పట్టుబడినట్లు రైల్వే GRP ఎస్‌ఐ వి.బాలాజీరావు చెప్పారు. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై తనిఖీ చేస్తుండగా బెర్హంపుర్ నుంచి చెన్నై వెళ్తున్న వ్యక్తి గంజాయితో పట్టుబడినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టు పేర్కొన్నారు.