

జనం న్యూస్ మే 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
పోలీసు అంటే ఇలా ఉండాలి అని అనేక కోణాల నుండి ప్రజల చేత మన్ననలు పొంది శభాష్ అనిపించుకున్న ఉత్తమ పోలీసు అధికారిగా బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.నరసింహ రాజు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ పది మంది పోలీసు అధికారుల్లో బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.నరసింహ రాజు ఒకరు. అయితే సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాత్రం బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.నరసింహ రాజు మొదటి స్థానంలో నిలిచారు. మూడు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ల పనితీరుకు సంబంధించి రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు ప్రజల నుండి క్యూ ఆర్ కోడ్, ప్రజల ఫీడ్ బ్యాక్ లను ఆయా పోలీసు స్టేషన్ ల పరిధిలో బోర్డులు ఏర్పాటు చేశారు. సంబంధిత పోలీసు స్టేషన్ అధికారుల గురించి వచ్చిన పనితీరును, ఫీడ్ బ్యాక్ లను పోలీసు ఉన్నతాధికారులు ఇటీవలే పరిశీలించారు. గత ఎనిమిది నెలల కాలంలో మూడు కమిషనరేట్ పరిధిలో బాలానగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ టి.నరసింహ రాజు ప్రజల నుండి ఉత్తమమైన మన్ననలు పొందడంలో మొట్టమొదటి స్థానంలో నిలిచినట్లు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ప్రకటించింది.