

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట పట్టణంలో పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని నెల్లూరు డీఎస్పీ స్థాయి అధికారులు వచ్చి వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి ఈరోజు తెల్లవారుజామున తీసుకెళ్లడం జరిగింది. వివరాల్లోకి వెళితే గత కొన్ని నెలల నుంచి ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిగా చెప్పుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తిరుగుతున్నారు అయితే ఆదివారం నాడు నెల్లూరుకు సంబంధించిన పోలీసులు గంజాయి అమ్ముతున్నాడని ఇద్దరు అన్నదమ్ములను నెల్లూరు పోలీసులు తీసుకెళ్లారు . వీరితోపాటు చిలకలూరిపేటకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహకులు కూడా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా గంజాయి అమ్ముకుంటూ పార్టీ పేరు చెప్పుకుంటూ చలామణి అవుతున్న నాయకులను ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల పలువురు పుర ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది