

జనం న్యూస్- మే 9- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ నెట్ బాల్ సెలక్షన్స్ ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యా యి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి , కాంగ్రెస్ పార్టీ ఓబిసి నాయకులు ఉంగరాల శ్రీనివాస్ పాల్గొని సెయింట్ జోసెఫ్ అఫ్ హై స్కూల్ హెచ్ఎం సిస్టర్ లలిత తో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి సబ్ జూనియర్ నెట్ బాల్ సెలక్షన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. నల్లగొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ జె కిరణ్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన నెట్ బాల్ సెలక్షన్స్ కు 80 మంది క్రీడాకారులు హాజరుకాగా వారిలో నుంచి అండర్ 16 బాలికల విభాగంలో జే సుప్లవి రాజ్, ఎండి సభానూర్, బి కీర్తన, బి మహేశ్వరి, ఎస్కే రిజ్వానా, బి కరుణ, ఎస్.కె మహేకె, జె దీక్షిత, ఆర్ సింధు, ఏ ఐశ్వర్య, సింధు, పూజ బాలుర విభాగంలో పృధ్విరాజ్, వెంకట సాయి, నిఖిలేష్, నజీ ర్ ,మధు, చైతన్య, సత్యసాయి, కళ్యాణ్, సాత్విక్, కమల్ తేజ్, కృష్ణ ,బాలు నల్లగొండ జిల్లా స్థాయి సబ్ జూనియర్ నెట్ బాల్ కు సెలెక్ట్ అయ్యారని, సెలెక్ట్ అయిన క్రీడాకారులు ఈ నెల 16, 17, 18 తేదీలలో జనగాం జిల్లా బతుకమ్మ కుంట క్రీడా మైదానంలో జరిగే స్టేట్ లెవెల్ సబ్ జూనియర్ పోటీలలో పాల్గొంటారని ఉమ్మడి నల్లగొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ జె కిరణ్ కుమార్ తెలిపారు,