

జాబ్ మేళా గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్,మే 09,అచ్యుతాపురం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా గోడ పత్రికను బుధవారం అచ్యుతాపురం ఎస్కెఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుత ఈ నెల 15న యలమంచిలి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. యలమంచిలి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగా కల్పనే థ్యేయంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 15 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాల న్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్. గోవిందా రావు,తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.