

జనం న్యూస్ మే 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం, కాట్రేనికోన గత మూడు సంవత్సరాల నుండి ఆణి విళ్ళ వెంకటరమణ సేవా ట్రస్ట్ తరఫున మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం నందు దాహర్తులకు మజ్జిగ ఇచ్చే సేవ కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు ఫణికాంత్ శాస్త్రి నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దాతలు ఈరోజ ఆలయం వద్ద మజ్జిగనిచ్చినటువంటి దాతలు ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి.రేపు ఆలయం వద్ద మజ్జిగనిచ్చేటువంటి దాతలు కీర్తిశేషులు గ్రంధి చిన్న సూర్యం వారు సతీమణి అచ్చుతాంబ జ్ఞాపకార్థం వారి కుమారుడు గ్రంధి నాగేశ్వరరావు
వీరభద్ర సూపర్ మార్కెట్, కాట్రేనికోనఆలయం దగ్గర నిర్వహించే పలు సేవా కార్యక్రమాల్లో వారు వంతుగా పాల్గొంటున్న అందరికీ కూడా ఆలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవస్థానo, కాట్రేనికోన.