

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : పట్టణ సీ.ఐ. పి.రమేష్ కు 2024 బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డును పల్నాడుజిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు చేతులు మీదుగా అందుకున్నారు. సి.ఐ.ని హృదయపూర్వకంగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన సంవత్సరంలో పట్టణ సీ.ఐ. పి.రమేష్ ఎస్పీ కంచి శ్రీనివాసరావు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డులను ప్రధానం చేశారని, పలువురు జర్నలిస్టు సంఘాలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో చెన్నకేశవుల రాంబాబు, బి.శ్రీను నాయక్, డి.గోపీనాయక్, ఇమ్మడి సురేంద్ర, మొహమాటం సురేష్, పుట్టా వెంకట బుల్లోడు తదితర జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు.