Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో 2025- 26 విద్యాసంవత్సరానికి దోస్తు ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ తెలిపారు. తమ కళాశాల న్యాక్ ” ఏ” గ్రేడ్ మరియు 10 సంవత్సరాల అటానమస్ హోదా కలిగిన కళాశాల, అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది, అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధి తమ ధ్యేయమని ప్రిన్సిపాల్ తెలిపారు. తమ కళాశాలలో బిఎ, బిఎస్సి లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బీకాం, కంప్యూటర్ అప్లికేషన్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయి.ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, తమ కళాశాల దోస్త్ కోడ్ 5011 అని, అప్లై చేసేటప్పుడు తమ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు, మరిన్ని వివరాలకై దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్. జి. వెంకటేశం (9492795524) గారిని సంప్రదించగలరు అని అన్నారు.