Listen to this article

జనం న్యూస్ 10మే పెగడపల్లి ప్రతినిధి


జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలోని ఐకెపిమరియు పిఎసిఎస్ వారి ధాన్య కొనుగోలు సెంటర్లను వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి తో కలిసి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇన్చార్జి సతీష్,అంజన్న లకు వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచి త్వరగా కొనుగోలు పూర్తి చేయాలని అలాగే రైతులకు త్రాగునీటి సౌకర్యంతో పాటు నీడను కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం, అనిల్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు దీకొండ తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ బోడపట్ల ఐలయ్య,స్థానిక నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.