Listen to this article

జుక్కల్ ఏప్రిల్ 9 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామ అంగన్వాడి కేంద్రానికి కిటికీ వద్ద గుర్తుతెలియని దుండగులు నిప్పు అంటించారని కొన్ని పేపర్లలో ప్రచురితమైన వార్తను చూసి. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. సిఐటియు. జిల్లా గౌరవ అధ్యక్షులు. సురేష్ అన్న అల్లాపూర్ గ్రామానికి వెళ్లి అంగన్వాడి సెంటర్ పరిశీలించి అంగన్వాడికి టీచర్ సావిత్రి గారిని అడుగగా. టీచర్ గారు చెప్తూ బుధవారం నాడు సూపర్వైజర్ గారు. వచ్చి గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు. మాట్లాడి. టి హెచ్ ఆర్. పంపిణీ చేసి అంగన్వాడి సెంటర్ బంద్ చేసి తాళం వేసుకొని ఇంటికి వెళ్లిన గంటలో. అంగన్వాడి సెంటర్ కు గుర్తు తెలియని దుండగులు మంటలు పెట్టారని. అంగన్వాడి సెంటర్ నుండి పొగలు వస్తున్నాయని గ్రామస్తులు. మంటలను ఆర్పుతూ నాకు పిలిచినారు నేను వచ్చి అంగన్వాడి సెంటర్ తాళం తీసి చూడగా కిటికీ నుండి ఎవరో గుర్తు తెలియని వారు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఉంటారని నా మీద పగతో ఎవరో చేసి ఉంటారని టీచర్ అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ అన్న తో తెలిపినారు. అక్కడ ఉన్న కొందరు గ్రామస్తులతో సురేష్ అన్న మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. అంగన్వాడి కేంద్రాన్ని ఎవరు మంటలు పెట్టారని మేము గ్రామస్తులు చూసి నీళ్లతో మంటలు ఆర్పినామని టీచర్ వచ్చిన తర్వాత సెంటర్ తీసి చూడగా కొన్ని వస్తువులు కాలిపోయి బూడిద అయినాయని బిల్డింగ్ లోపట పొగతో పైకప్పు సగభాగం గోడలు పొగతో మొత్తం నల్లబడ్డాయని గ్రామస్తులు తెలిపారు. అంగన్వాడి సెంటర్ ని మంటలు తలిగి రెండు రోజులైనా సంబంధిత సూపర్వైజర్ వచ్చి చూడకపోవడం ఆమె నిర్లక్ష్యానికి నిదర్శనం అని సురేష్ అన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పిట్లం పోలీస్ స్టేషన్లో ఇట్టి విషయంపై ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీసులు ఇలాంటి చర్యలు ఎక్కడ జరగకుండా నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని పిట్లం పోలీస్ శాఖకు సిఐటియు జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి తెలిపినారు. అంగన్వాడి అధికారులు ఇప్పటికైనా వచ్చి అల్లాపూర్ అంగన్వాడి సెంటర్కు నిప్పు పెట్టిన దుండగులపై చర్యలు తీసుకునే విధంగా పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు లేనిచో ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయవలసి వస్తుందని హెచ్చరించారు.