Listen to this article

జనం న్యూస్, మే 10 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

భారత్, పాక్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగు తోంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతుం డగా.. భారత సైన్యం దీటు గా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీర మరణం పొందారు.మృతి చెందిన జవాన్‌ను మురళీనాయక్‌గా గుర్తిం చారు. ఇతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లి తండా. రేపు స్వగ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు సమాచారం.తల్లిదండ్రులకు మురళి నాయక్,ఏకైక సంతానం. ఇక సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌ విద్యా వ్యాసం చేసిన వీర జవాన్.. 2022లో ఇండియన్‌ ఆర్మీలో చేరాడు.నాసిక్‌లో శిక్షణ పొంది, జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్‌ కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. పంజాబ్‌లో పనిచేస్తుం డగా.. భారత్-పాక్‌ ఉద్రిక్త తల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పంజాబ్ నుంచి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లాడు. అక్కడ పాక్‌ కాల్పుల్లో వీరమరణం పొందాడు.