Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 తర్లుపాడు మండలం లోని కేతగుడిపి గ్రామం నందు పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి కేతగుడిపి గ్రామ సర్పంచ్ డి. పెద్ద మస్తాన్ 15000/-రూపాయలు విలువ చేసే మందులు స్పాన్సర్ చేసారు,పశువైద్య డాక్టర్ సౌజన్య గొర్రెలు, మేకలు మరియు లేగ దూడలకు నట్టల నివారణ మందులు పంపిణి చేయటం జరిగింది అలాగే పాడి రైతులకు సీజనల్ వ్యాధుల పై అవగాహనా, చుడి పరీక్షలు, గర్భ కోశ వ్యాదుల చికిత్స, నివారణ చర్యలు గురించి అవగాహన కల్పించటం జరిగింది…ఈ కార్యక్రమం లో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కవిత, శ్వేత, మనోజ్, భార్గవి గోపాలమిత్ర రామయ్య, రాము గ్రామ ప్రజా ప్రతినిధులు బుర్రి మల్లయ్య, పి. వెంకట కృష్ణ గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు….